Google గోప్యత వివరణ
స్కోప్
ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉండే Google ఉత్పత్తులు, సేవలు మరియు వెబ్సైట్లకు వర్తిస్తుంది (అన్ని కలిపి , Google యొక్క "సేవలు"గా పరిగణిన్చబడతాయి ). మేము సేకరించే వ్యక్తిగత సమాచారం మరియు ఇతర డేటా
- మీరు Google సేవకు రిజిస్టర్ చేసినప్పుడు లేదా అటువంటి సమాచారాన్ని స్వబుద్ధితో అందించినప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని Google సేకరిస్తుంది. మీకు ఉత్తమ యూజర్ అనుభవాన్ని అందించడానికి, మీ కోసం కంటెంట్‌ను అనుకూలీకరించడంతో సహా ఇతర Google సేవలు లేదా మూడవ పార్టీల సమాచారంతో మీ నుండి సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని మేము చేర్చుతాము.
- మీ ఆన్లైన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు మా సేవల నాణ్యతను పెంపొందించడానికి Google సేవలను మీరు ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి కుక్కీలు మరియు ఇతర టెక్నాలజీలను Google ఉపయోగిస్తుంది.
- మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు లేదా మా ఉత్పత్తుల్లో కొన్నిటిని ఉపయోగించినప్పుడు URL, IP చిరునామా, బ్రౌజర్ రకం, భాష మరియు మీ అభ్యర్థన యొక్క తేదీ మరియు సమయం వంటి సమాచారాన్ని Google సర్వర్లు ఆటోమేటిక్‌గా రికార్డ్ చేస్తాయి.
- పూర్తి గోప్యత విధానంలో ఇంకా చదవండి.
ఉపయోగాలు
- అనుకూలీకరించిన కంటెంట్ మరియు ప్రకటనను ప్రదర్శించే సేవలతో సహా, మీరు అభ్యర్థించే సేవలను అందించడానికి వ్యక్తిగత సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము.
- Google టెక్నాలజీలు మరియు సేవలను నిర్వహించడానికి మరియు మెరుగుపరచడానికి ఆడిటింగ్, పరిశోధన మరియు విశ్లేషణ కోసం వ్యక్తిగత సమాచారాన్ని కూడా మేము ఉపయోగిస్తాము.
- Googleకు వెలుపల ఉన్న మూడవ పార్టీలతో మొత్తం వ్యక్తిగతం కాని సమాచారాన్ని మేము భాగస్వామ్యం చేస్తాము.
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు మాకు సహాయం చెయ్యడానికి మూడవ పార్టీలను మేము ఉపయోగించేటప్పుడు, వారు మా గోప్యత విధానం, ఇతర రహస్యాలు మరియు భద్రతా విషయాలతో కట్టుబడి ఉండాలి.
- మేము మూడవ పార్టీలతో చట్టపరమైన ప్రాసెస్, మోసం లేదా జరగనున్న ప్రమాదం మరియు మా నెట్వర్క్ లేదా సేవల యొక్క భద్రతను నిర్ధారించడం వంటి విషయాలకు కట్టుబడి ఉన్నప్పుడు, కొన్ని పరిమిత సందర్భాల్లో సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తాము.
- Google మా సర్వర్లపై వ్యక్తిగత సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఇతర దేశాల్లో ప్రాసెస్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, మీ స్వంత దేశానికి వెలుపల కూడా ఒక సర్వర్‌పై వ్యక్తిగత సమాచారాన్ని మేము ప్రాసెస్ చేస్తాము.
- పూర్తి గోప్యత విధానంలో ఇంకా చదవండి.
మీ ఎంపికలు
- వీలైన సందర్భాల్లో, మీ వ్యక్తిగత సమాచారం గురించి మేము అడిగినప్పుడు మీకు ఎంపికలను ప్రతిపాదిస్తాము. ప్రత్యేక సేవల కోసం మీ ఎంపికల గురించిన మరింత సమాచారాన్ని గోప్యత ప్రకటనలు లేదా FAQలలో మీరు కనుగొనవచ్చు.
- మా ఫీచర్లు లేదా సేవలలో కొన్ని సరిగ్గా పనిచేయకపోతే , మీ వ్యక్తిగత సమాచారాన్ని మాకు అందించడానికి మీరు నిరాకరించవచ్చు మరియు/లేదా మీ బ్రౌజర్లో కుక్కీలను తిరస్కరించవచ్చు.
- వీలైన సందర్భాల్లో, తప్పు డేటాను సరిదిద్దడానికి మరియు దాన్ని తొలగించడానికి మీ అభ్యర్థనపై మీ వ్యక్తిగత సమాచారాన్ని మీరు ఆక్సెస్ చెయ్యడానికి మేము నమ్మకమైన ప్రయత్నాలను చేస్తాము.
- పూర్తి గోప్యత విధానంలో ఇంకా చదవండి.
మరింత సమాచారం
నిర్దిష్ట Google సేవలు గురించి మరింత సమాచారానికి, దయచేసి నావిగేషన్ బార్‌కు ఎడమ వైపున ఉన్న సరైన గోప్యత ప్రకటను తనిఖీ చెయ్యండి లేదా Google సహాయం పేజీని తనిఖీ చెయ్యండి. Google EU/US Safe Harbor ప్రోగ్రామ్ సభ్యత్వంలో ఉంది.
మా గోప్యత అభ్యాసాల గురించి మరింత సమాచారానికి, పూర్తి గోప్యత విధానం చూడండి. మీ గోప్యత మరియు Googleకు సంబంధించి అదనపు ప్రశ్నలు అడగాలనుకుంటే, దయచేసి మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి. Google యొక్క గోప్యత విధానానికి సంబంధం లేని పరిశీలనలకు మేము ప్రతిస్పందించమని దయచేసి గమనించండి.
