హోమ్ / వార్తలు / ఇండియా న్యూస్ / సిగరెట్లు మానేసి ఇల్లు కట్టాడు... 8 ఏళ్లలో ఎన్ని లక్షలు జమచేశాడంటే..

సిగరెట్లు మానేసి ఇల్లు కట్టాడు... 8 ఏళ్లలో ఎన్ని లక్షలు జమచేశాడంటే..

5 లక్షల డబ్బుతో తన ఇంటిపై మరో అంతస్తు నిర్మించారు వేణుగోపాలన్ నాయర్. సిగరెట్లు మానేసిన తర్వాత తన జీవితం ఎంతో మారిపోయందని ఆయన అన్నారు. ఆరోగ్యం మెరుపడడంతో పాటు ఆర్థికంగానూ లాభపడినట్లు వెల్లడించారు.

ప్రకటనలు

ఇక కొద్దిరోజుల క్రితం సిగరెట్ తాగేవారికి, వెజిటేరియన్లకు కరోనా సోకే అవకాశం తక్కువగా ఉందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) నివేదిక వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి.

ప్రకటనలు

(మీరా మను, న్యూస్ 18 కేరళ ప్రతినిధి)

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత ప్రచారం చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చాలా మంది యువత స్కూల్ ఏజ్ నుంచే ధూమపానానికి అలవాటు పడుతున్నారు. పెట్టెలు పెట్టెలు సిగరెట్లను పీల్చేస్తున్నారు. ఐతే సిగరెట్లు మానేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ బాగపడుతామని కేరళకు చెందిన ఓ పెద్దాయన నిరూపించారు. చిన్నప్పటి నుంచి చుట్ట తాగడం అలవాటున్న ఆయన కొన్నేళ్లుగా సిగరెట్లు మానేసి.. ఆ డబ్బును జమచేశారు. అలా జమచేసిన డబ్బుతో ఏకంగా ఇళ్లు కట్టేశారు.

ఈయన పేరు వేణుగోపాలన్ నాయర్. వయసు 75 ఏళ్లు. కేరళలోని కోజికోడ్‌లో నివసిస్తున్నారు. వృత్తిరిత్యా భవన నిర్మాణ కార్మికుడు. భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 13 ఏళ్ల వయసు నుంచే ఈయన బీడీలకు అలవాటు పడ్డారు. ఆ రోజుల్లో ముప్పావు అణాలకు మూడు సిగరెట్లు వచ్చేవి. అలా సిగరెట్లకు బానిసయ్యారు వేణుగోపాలన్. నిత్యం పెట్టెన్నర అంటే 20 సిగరెట్లు తాగేవారు. కుటుంబ సభ్యులు చెప్పినా.. డాక్టర్లు హెచ్చరించినా వినలేదు. 67 ఏళ్ల వయసు వచ్చే వరకు డబ్బాలకు డబ్బాలు సిగరెట్లు లాగించారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన జీవితం తలకిందులైంది.

సంబంధిత వార్తలు

వేణుగోపాల్ నాయర్

2012లో ఓసారి ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది. చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లారు వేణుగోపాలన్. సిగరెట్లు మానేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ఒక నుంచి ఒక్క సిగరెట్ తాగినా ఆరోగ్య మరింతగా క్షీణిస్తుందని చెప్పి.. కొన్ని మందులతో ట్రీట్‌మెంట్ చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్క సిగరెట్ కూడా తాగలేదు. ఆయన చివరిసారిగా సిగరెట్ తాగినప్పుడు ఒక పెట్టె ధర 50 రూపాయలు. నిత్యం పెట్టెన్నర తాగడంతో 70 నుంచి 100 రూపాయలు ఖర్చయ్యేవి. సిగరెట్లు మానేసిన తర్వాత ఆ డబ్బును జమచేస్తూ వచ్చాడు. 8 ఏళ్లు తిరిగే సరికి రూ.5 లక్షలు పోగయ్యాయి. కేవలం సిగరెట్లు తాగేందుకు ఖర్చు చేసే డబ్బును జమచేస్తే అన్ని లక్షలు మిగిలాయి.

ప్రకటనలు

ఆ 5 లక్షల డబ్బుతో తన ఇంటిపై మరో అంతస్తు నిర్మించారు వేణుగోపాలన్ నాయర్. సిగరెట్లు మానేసిన తర్వాత తన జీవితం ఎంతో మారిపోయందని ఆయన అన్నారు. ఆరోగ్యం మెరుపడడంతో పాటు ఆర్థికంగానూ లాభపడినట్లు వెల్లడించారు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ జీవితంలో సిగరెట్ ముట్టనని చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది యువత సిగరెట్ల పొగలో చిత్తవుతున్నారు. అలాంటి చైన్ స్మోకర్లకు వేణు గోపాలన్ నాయర్ స్ఫూర్తిగా నిలిచారు. యువత సిగరెట్లు, మద్యాన్ని వీడి జీవితంలో స్థిరపడేందుకు కష్టపడాలని సూచిస్తున్నారు.

ప్రకటనలు
అగ్ర వీడియోలు
  • October 14, 2023, 3:49 pm IST GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

ఫోటో

ఉత్తమ కథలు