Drive logo

డిస్క్ నిల్వ లక్షణాలను విశ్లేషించండి

మీ అంశాలు మీ వెన్నంటే ఉంటాయి - డిస్క్ లక్షణాలు

 

మీ నిల్వ డిస్క్‌, Gmail మరియు Google ఫోటోలుతో పని చేస్తుంది, కాబట్టి మీరు నేరుగా డిస్క్‌లో ఫైల్‌లను నిల్వ చేయవచ్చు, ఇమెయిల్ జోడింపులను సేవ్ చేయవచ్చు మరియు ఫోటోలను బ్యాకప్ చేయవచ్చు. అలాగే మీకు అవసరమైతే అధిక క్లౌడ్ నిల్వ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.

15 GB ఉచిత Google డిస్క్ నిల్వ లోగో

ఫోటోలు, వీడియోలు, ప్రెజెంటేషన్‌లు, PDFలు – Microsoft Office ఫైల్‌లు కూడా. ఫైల్ రకంతో సంబంధం లేకుండా, ప్రతిదీ డిస్క్‌లో సురక్షితంగా నిల్వ చేయవచ్చు.

చిత్రాలు, పత్రాలు మరియు సంగీతంతో సహా Google డిస్క్ ఫైల్ రకం జాబితా

మీరు డిస్క్‌లోని ఫైల్‌లను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకునే వరకు అవి ప్రైవేట్‌గా ఉంటాయి. మీరు ఎంచుకునే ఏదైనా ఫైల్ లేదా ఫోల్డర్‌ను వీక్షించడానికి, వ్యాఖ్యానించడానికి మరియు సవరించడానికి ఇతరులను శీఘ్రంగా ఆహ్వానించవచ్చు. వీటిపై ఆన్‌లైన్‌లో కలిసి పని చేయగల సదుపాయం మరింత సులభం చేయబడింది.

Google డిస్క్ గోప్యత మరియు భాగస్వామ్య ఎంపికలు

మీ ఫైల్ భద్రత చాలా ముఖ్యం. అందుకే మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌కి ఏమి జరిగినా డిస్క్‌లో ప్రతి ఫైల్ సురక్షితంగా ఉంటుంది. Gmail మరియు ఇతర Google సేవల్లో వినియోగించే అదే భధ్రతా ప్రోటోకాల్ అయిన SSLని ఉపయోగించి డిస్క్ గుప్తీకరించబడింది.

Google డిస్క్ భద్రతా లాక్

Googleతో పని చేయడానికి రూపొందించబడింది

 
Gmail ఫోటో జోడింపు ఒక క్లిక్‌తో డిస్క్‌కి సేవ్ చేయబడటం

Gmailలోని జోడింపుపై కర్సర్ ఉంచి, డిస్క్ లోగో కోసం చూడండి. ఇక్కడ, మీరు ఏ జోడింపునైనా ఒక సురక్షిత స్థలంలో నిర్వహించడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి వాటిని మీ డిస్క్‌లో సేవ్ చేయవచ్చు.

Gmail ఫోటో జోడింపు ఒక క్లిక్‌తో డిస్క్‌కి సేవ్ చేయబడటం

డిస్క్ మీ చిత్రాల్లోని ఆబ్జెక్ట్‌లను మరియు స్కాన్ చేసిన పత్రాల్లో వచనాన్ని గుర్తించగలదు. కాబట్టి మీరు “ఈఫిల్ టవర్” వంటి ఏదైనా పదాన్ని శోధించి, ఆ పదం కలిగి ఉన్న వచన పత్రాలను అలాగే అసలైన ఈఫిల్ టవర్ చిత్రాలను పొందవచ్చు.

Google డిస్క్‌లో నిల్వ చేసిన మరియు Google+లో భాగస్వామ్యం చేసిన ఒరెగాన్ తీరం ఫోటో

మీ ఫోటోలను డిస్క్‌లో నిల్వ చేయండి మరియు Google ఫోటోలుతో వాటిని జీవకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దండి. ఎటువంటి శ్రమ లేకుండా, యానిమేషన్‌లు, చలన చిత్రాలు మొదలైన వాటితో నైపుణ్యవంతమైన రీతిలో సవరించిన రూపాన్ని పొందండి..

Chromebookల్లో Google డిస్క్ డేటా

Google డిస్క్ అనేది Chromebookల్లో అంతర్నిర్మితమై ఉంటుంది, కాబట్టి మీ ఫైల్‌లు మరియు ఫోటోలు స్వయంచాలకంగా బ్యాకప్ చేయబడతాయి. మీరు సరికొత్త Chromebookలతో రెండు సంవత్సరాల పాటు 100GB ఉచిత నిల్వను పొందుతారు.

 

అనువర్తనాలతో ఉత్తమంగా పని చేయండి

 

సృష్టించండి మరియు ఇతరులతో కలిసి పని చేయండి. మా డాక్స్, షీట్‌లు మరియు స్లయిడ్‌ల అనువర్తనాలతో విమానయానంలో కూడా పత్రాలు మరియు ఫైల్‌లను భాగస్వామ్యం చేయండి, స్ప్రెడ్‌షీట్‌లను తయారు చేయండి మరియు ప్రెజెంటేషన్‌ను రూపొందించండి.

Google డిస్క్ పత్రాలు, షీట్‌లు మరియు స్లయిడ్‌లు భాగస్వామ్యం చేయడానికి అందుబాటులో ఉంటాయి

Google ఫారమ్‌ల ను ఉపయోగించి సరళమైన ఆన్‌లైన్ ఫారమ్‌తో మీరు సర్వేను నిర్వహించవచ్చు లేదా శీఘ్రంగా బృందం జాబితాను రూపొందించవచ్చు. ఆపై స్ప్రెడ్‌షీట్‌లో స్పష్టంగా అందించిన ఫలితాలను చూడండి.

Google డిస్క్‌లో Google ఫారమ్‌లు ఉదాహరణ

Google డ్రాయింగ్‌‍‌ల తో రేఖాచిత్రాలను గీయండి, ఫ్లో చార్ట్‌లను సృష్టించండి, ఆపై వాటిని సులభంగా ఇతర పత్రాలకు జోడించండి లేదా వాటిని వెబ్‌సైట్‌లో పొందుపరచండి.

Google డ్రాయింగ్‌లు చిహ్నం

మీ ప్రొఫైల్ ఫోటోను సవరించండి, కొన్ని మెరుగులతో రమణీయంగా మార్చండి, మైండ్ మ్యాప్‌ను సృష్టించండి మరియు మరిన్ని చేయండి. 100కు పైగా ఉన్న డిస్క్ అనువర్తనాలు మీ అంశాలతో మరిన్ని చేయడంలో మీకు సహాయపడతాయి. Chrome వెబ్ స్టోర్‌లోని డిస్క్ సేకరణ నుండి ఒకదాన్ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా వాటిని ప్రయత్నించండి.

100కి పైగా Google డిస్క్ అనువర్తనాలు అందుబాటులో ఉన్నాయి

డిస్క్ నుండి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందండి

 
Android ఫోన్‌తో ఫోటో తీయడం ద్వారా డిస్క్‌కి పత్రాలను సేవ్ చేయడానికి ఉదాహరణ

Android కోసం డిస్క్‌తో మీ కాగితపు పత్రాలన్నింటినీ స్కాన్ చేయండి. రసీదులు, ఉత్తరాలు మరియు ప్రకటనల వంటి పత్రాల యొక్క ఫోటోను తీయండి – డిస్క్ వాటిని తక్షణమే PDFలుగా నిల్వ చేస్తుంది.

Google డిస్క్ ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ మార్పు

ఫైల్‌లు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండేటట్లు చేయండి, అందువల్ల మీరు విమానంలో ఉన్న లేదా సరైన కనెక్షన్ లేని భవనంలో ఉన్న పరిస్థితుల్లో మీ ఫోన్ లేదా టాబ్లెట్ సేవను కోల్పోయినా వాటిని వీక్షించవచ్చు.

Google డిస్క్ ఫైల్ పునర్విమర్శ చరిత్ర ఉదాహరణ

మీరు దాదాపు అన్ని ఫైల్ రకాలకు 30 రోజుల దాకా గతంలో జరిగిన మార్పులు చూడవచ్చు, అందువల్ల ఎవరు మార్పులు చేసారో తెలుసుకోవడం మరియు మునుపటి సంస్కరణలకు తిరిగి వెళ్లడం సులభమవుతుంది. ఫైల్‌ను సంస్కరించడం సులభం చేయబడింది.