లిప్యంతరీకరణ

లిప్యంతరీకరణ 20కి పైగా భాషలకు మద్దతిస్తుంది. లిప్యంతరీకరణ అంటే ఏమిటి మరియు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేవాటిని తెలుసుకోవడానికి కింది వీడియోను చూడండి. ఆలాగే దీన్ని ఆన్‌లైన్‌లో ప్రయత్నించండి.

లిప్యంతరీకరణ అనేది ఫొనెటిక్ సారూప్యత ఆధారంగా ఒక రకమైన వ్రాత నుండి మరొకదానికి సరిపోల్చే పద్ధతిని సూచిస్తుంది. ఈ సాధనంతో, మీరు లాటిన్ అక్షరాల్లో టైప్ చేయాలి (ఉదా. a, b, c మొదలైనవి.), అవి లక్ష్య భాషలో సారూప్య ఉచ్ఛారణ ఉన్న అక్షరాలకు మార్చబడతాయి. ఉదాహరణకు, హిందీ లిప్యంతరీకరణలో, మీరు "नमस्ते" పొందడానికి "namaste" అని టైప్ చేయవచ్చు, ఇది "namaste"గా పలకబడుతుంది. ఎంచుకోవడం కోసం మీకు సూచిత పదం లిప్యంతరీకరణల జాబితా చూపబడవచ్చు. “లిప్యంతరీకరణ” అనేది "అనువాదానికి" భిన్నంగా ఉంటుంది: మార్పిడి ఉచ్ఛారణ ఆధారంగా జరుగుతుంది అంతేకానీ అర్థం ఆధారంగా కాదు.

లిప్యంతరీకరణ అస్పష్ట ఫోనెటిక్ మ్యాపింగ్‌కు మద్దతిస్తుంది. మీరు ఊహించే ఉత్తమ ఉచ్ఛారణను లాటిన్ అక్షరాల్లో టైప్ చేయండి ఆపై లిప్యంతరీకరణ దాన్ని ఉత్తమ సూచనలతో సరిపోలుస్తుంది. ఉదాహరణకు, "namaste" మరియు "nemaste" రెండూ సూచిత పదం‌గా "नमस्ते"కి మార్చబడతాయి.

లిప్యంతరీకరణను ఉపయోగించడానికి, మొదటి దశగా ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించాలి. శోధన, Gmail, Google డిస్క్, Youtube, అనువాదం, Chrome మరియు Chrome OSలో ఇన్‌పుట్ సాధనాలను ప్రారంభించడానికి సూచనలను అనుసరించండి.

లిప్యంతరీకరణ అనేది భాష నుండి వంటి అక్షరం ద్వారా సూచించబడుతుంది. ప్రస్తుత లిప్యంతరీకరణని ఆన్/ఆఫ్‌కు టోగుల్ చేయడానికి చిహ్నంపై క్లిక్ చేయండి లేదా మరో ఇన్‌పుట్ సాధనాన్ని ఎంచుకోవడానికి దాని పక్కన ఉన్న బాణంపై క్లిక్ చేయండి. లిప్యంతరీకరణ ఆన్‌కు టోగుల్ చేయబడినప్పుడు, బటన్ ముదురు బూడిద రంగు కి మారుతుంది.

లిప్యంతరీకరణను ఉపయోగిస్తున్నప్పుడు, పదాన్ని ఫొనెటిక్ రూపంలో లాటిన్ అక్షరాల్లో టైప్ చేయండి. మీరు టైప్ చేస్తున్నప్పుడే, ఫొనెటిక్ అక్షరక్రమానికి సరిపోయే సూచిత పదాల జాబితా మీకు కనిపిస్తుంది. మీరు కింది చర్యల్లో ఒకదాన్ని చేయడం ద్వారా జాబితా నుండి పదాన్ని ఎంచుకోవచ్చు:

  • మొదటి సూచిత పదాన్ని ఎంచుకోవడానికి SPACE లేదా ENTER నొక్కండి,
  • పదంపై క్లిక్ చేయండి,
  • పదం ప్రక్కన ఉన్న సంఖ్యను నమోదు చేయండి,
  • UP/DOWN బాణం కీలతో పేజీలో సూచిత పదాల జాబితాను నావిగేట్ చేయండి. PAGEUP/PAGEDOWN కీలతో పేజీలను తెరవండి. ప్రముఖంగా చూపబడిన పదాన్ని ఎంచుకోవడానికి SPACE లేదా ENTER నొక్కండి